Atma Shatkam or Nirvana shatkam - Shivoham (Shiva within) Song and Lyrics in Telugu with meaning
న చ ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః న వా సప్తధాతుర్ న వా పంచ కోశాః | నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ చిదానంద రూపః శివోహం శివోహం ||
న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః | న ధర్మో న చార్ధో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహం శివోహం ||
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ | అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూపః శివోహం శివోహం ||
న మే మృత్యు శంకా న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ | న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపః శివోహం శివోహం ||
అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ | న చా సంగతం నైవ ముక్తిర్నమేయః చిదానంద రూపః శివోహం శివోహం ||
With Meaning:
మనో బుధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే | న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం ||
నేను మనస్సు కాదు,బుద్ధి కాదు, చిత్తము కాదు,అహంకారం కూడా కాదు. నేను పంచేంద్రియాలు కాదు. నేను పంచభూతాలు కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివున్ని. నేను శివుడిని.
న చ ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః న వా సప్తధాతుర్ న వా పంచ కోశాః | నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ చిదానంద రూపః శివోహం శివోహం ||
నేను ప్రాణాన్ని కాదు. పంచవాయువులు నేను కాదు. సప్త ధాతువులు నేను కాదు. పంచకోశాలు నేను కాదు. కర్మేంద్రియాలు నేను కాదు.నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః | న ధర్మో న చార్ధో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహం శివోహం ||
నాలో రాగద్వేషములు లేవు,లోభమోహాలు లేవు. నాలో మదమాత్సర్యాలు లేవు. ధర్మార్ధకామమోక్షాలు నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ | అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూపః శివోహం శివోహం ||
నాకు పుణ్యపాపాలు లేవు. నాకు సుఖదుఃఖాలు లేవు. మంత్రాలు,తీర్థాలు,వేదాలు,యజ్ఞాలు నేను కాదు. అనువించేవాన్ని నేను కాదు. అనుభవింపదగిన వస్తువు నేను కాదు. అనుభవం నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుభడిని. నేను శివుడిని.
న మే మృత్యు శంకా న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ | న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపః శివోహం శివోహం ||
నాకు జననమరణాలు లేవు. నాలో జాతి భేధాలు లేవు. నాకు తల్లిదండ్రులు లేరు. నాకు బంధుమిత్రులు లేరు. నాకు గురుశిష్యులు లేరు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ | న చా సంగతం నైవ ముక్తిర్నమేయః చిదానంద రూపః శివోహం శివోహం ||
నాలో మార్పులు లేవు. నాకు రూపం లేదు. నేను అంతటా ఉన్నాను. సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను. అన్నింటిలో సమానంగా ఉన్నాను. నాకు బంధమోక్షాలు లేవు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
https://en.wikipedia.org/wiki/Atma_Shatkam
Quality Audio song composed by Sadguru Team And isha is here
Comments
Post a Comment